

మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం కొన్నేళ్లుగా ఇతర సినిమాలకు దూరంగా ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ‘వారణాసి’ షూటింగ్ నుంచి పూర్తిగా రిలీవ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2027 మార్చిలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభమయ్యే వరకు ఉన్న సమయాన్ని మరో రెండు సినిమాలకు కేటాయించాలని మహేష్ భావిస్తున్నట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్, దిల్ రాజు, కేవీఎన్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిలింస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మహేష్ బాబును కలిసి పలు కథలు, ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఏ సినిమా కూడా అధికారికంగా ఖరారు కాలేదు. తెలుగు దర్శకుడితో సినిమా చేయాలా, లేక పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న దర్శకుడితో ముందుకు వెళ్లాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, వారు ఇప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలోనే మహేష్ బాబు తన తదుపరి సినిమాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!