

వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ ఏడాది కూడా వినియోగంలోకి రాకపోవచ్చని పరిస్థితి కనిపిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈ వర్షాకాలంలో వినియోగంలోకి వచ్చే అవకాశాలు లేవని అధికార వర్గాలు తెలిపాయి.
బ్యారేజీల భద్రత, పునాది స్థిరత్వం, పియర్ల పరిస్థితిపై నిర్వహిస్తున్న సాంకేతిక పరీక్షలు ఇంకా పూర్తికాలేదు. సుమారు 75 శాతం పరీక్షలు పూర్తయినా మిగిలిన పరిశీలనలు నవంబర్ వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో నీటి నిల్వలు సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది.
హైడ్రాలాజికల్, జియోటెక్నికల్ అధ్యయనాలు కొనసాగుతున్నాయి. 80 మీటర్ల లోతు వరకు బోర్లు వేసి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. రాఫ్ట్ కింద ఖాళీలు ఉన్నాయా అనే అంశంపై పరిశీలన జరుగుతోంది. తుది నివేదికలను సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏకు సమర్పించిన తర్వాతే భవిష్యత్ నిర్ణయాలు తీసుకోనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!