
సినిమాలు

తెలంగాణకు కృష్ణా జలాలను విడుదల చేయాలన్న విజ్ఞప్తికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. కృష్ణా బేసిన్‌లో నెలకొన్న నీటి కొరత పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పంటలను కాపాడేందుకు కర్ణాటకలోని ఎగువ కృష్ణా వ్యవస్థ నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూరాల ఆయకట్టు పరిధిలో నీటి ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించడంపై సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహభావానికి, తెలంగాణ–కర్ణాటక ప్రజల మధ్య ఉన్న సోదర భావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే అంశంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయి పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని కోరింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!