

ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఏర్పడిన తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా మారి వాయవ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో నవంబర్ 10, 11, 15, 16 తేదీల్లో, కేరళలో నవంబర్ 16న భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లో నవంబర్ 10 నుంచి 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 12న కశ్మీర్ లోయలో వర్షాలు, మంచు కురిసే సూచనలున్నాయి. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక లేకపోయినా, నవంబర్ 14 నుంచి 16 మధ్య అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందని లేదా తీరం దాటుతుందని IMD ప్రకటించలేదు. తదుపరి వాతావరణ బులెటిన్ల ఆధారంగా పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!