
సినిమాలు

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. స్వామివారి దర్శనం కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. ఇందుకోసం శబరిమల అధికారిక శబరి పోర్టల్ ద్వారా వర్చువల్ క్యూ స్లాట్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవాలని సూచించారు.
భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ బుకింగ్‌కు సంబంధించిన QR కోడ్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. దర్శనానికి వెళ్లే భక్తులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ స్లాట్‌ను రిజర్వ్ చేసుకోవాలని కోరారు. శబరిమల యాత్రకు వెళ్లే వారు అధికారిక పోర్టల్‌లోని సూచనలను పాటించాలని అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!