

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లో అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తూ, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు పార్టీ ముఖ్య నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఉదయం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్, హరీశ్ రావు, వినోద్, జిల్లా నేతలతో మాట్లాడుతూ అవసరమైన ఏర్పాట్లపై సూచనలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. వైద్యులు కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను కేసీఆర్‌కు తెలియజేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!