
రాజకీయాలు

కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ సిబ్బందికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఆలయానికి వచ్చే భక్తుల పట్ల గౌరవంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించింది. విధుల నిర్వహణలో అత్యున్నత స్థాయి సంయమనం, మర్యాద పాటించాలని స్పష్టం చేసింది. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
ముఖ్యంగా ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. క్యూలైన్ల నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూనే భక్తుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. రద్దీ నియంత్రణ, క్యూలైన్ నిర్వహణ మధ్య సరైన సమతుల్యత ఉండాలని స్పష్టం చేసింది. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి గౌరవప్రదమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!