
జనరల్

హైదరాబాద్ జలమండలి నగర వాసులకు కీలక సూచనలు జారీ చేసింది. ట్యాంకర్ బుకింగ్‌కు సంబంధించిన ఎస్‌ఎంఎస్ సేవలు ప్రస్తుతం ఎస్‌డీసీ లింక్ సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
సమస్య పరిష్కారమయ్యే వరకు ట్యాంకర్ బుకింగ్ కోసం ఐవీఆర్‌ఎస్ సేవలను వినియోగించాలని సూచించారు. సాంకేతిక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించేందుకు పని చేస్తున్నాయని, తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్న ఘటనపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి దుకాణం శుభ్రం చేయడానికి తాగునీటిని ఉపయోగిస్తుండగా గుర్తించి వెంటనే జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!