
రాజకీయాలు

కొండా సురేఖ అంశంపై గద్వాల విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్‌దేనని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రిని చూసి తనకు పదవులు ఇస్తున్నారనే ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. తాను పదవులకు పూర్తిగా అర్హురాలినని విజయలక్ష్మి పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకు ఉందని విజయలక్ష్మి అన్నారు. తాను ప్రస్తుతం కొనసాగుతున్న హోదాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సురేఖ అంశంపై పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయలక్ష్మి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!