

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన 2021 గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ప్రాసిక్యూషన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా భావిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు కోరింది.
దీంతో గుడివాడ పోలీసులు 2021 ఫిబ్రవరి 16న వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. అప్పట్లో కొడాలి నాని మంత్రిగా ఉన్నందున కేసు విచారణ కొనసాగించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది. కృష్ణా జిల్లా అధికారుల నివేదికలు, కేసు రికార్డులను పరిశీలించిన ప్రభుత్వం ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు నిర్ధారించి ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!