
షోస్

నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నేటి నుంచి ‘జెన్ జీ’ యువతతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు, ఆలోచనలను తెలుసుకోనున్నారు. నియోజకవర్గంలోని యువతతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో సుమారు 20 వేల మందిని కలవాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. యువతతో ముఖాముఖి చర్చల ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకుని, స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పొందనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!