

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి తెలంగాణలో ఆధునిక సాంకేతిక రంగ అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలు సమర్పించారు. కొత్త జాతీయ ఏఐ విధానంలో భాగంగా వరంగల్ ఐటీ హబ్‌లో ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో అవసరమైన మౌలిక వసతులు ఇప్పటికే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఉమ్మడి కరీంనగర్ లేదా ఖమ్మం జిల్లాల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ డిజైన్, డీప్‌టెక్ రంగాలపై దృష్టి సారించే ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో టైర్-2 నగరంలో కూడా ఎస్టీపీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జిల్లా ఐటీ టవర్లను కేంద్ర ప్రభుత్వ ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఐటీ రంగ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగినప్పుడు హైదరాబాద్‌లో 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 9.39 లక్షలకు తగ్గిందని ఆరోపించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!