
జనరల్

ప్రతిష్ఠాత్మక సైమా 2026 అవార్డుల వేడుకలో ‘మిరాయ్’ చిత్రం సత్తా చాటింది. బెంగళూరులో జరిగిన ఈ వేడుకలో నాలుగు ప్రధాన విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుని మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఉత్తమ చిత్రం (2025)గా ‘మిరాయ్’ ఎంపిక కాగా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్ - సూపర్‌హీరో) అవార్డును తేజ సజ్జా సొంతం చేసుకున్నారు.
అలాగే ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును కార్తీక్ ఘట్టమనేని, ఉత్తమ విలన్ (నెగటివ్ రోల్) అవార్డును మంచు మనోజ్ అందుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సైమా వేదికపై నాలుగు అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!