
షోస్

భక్తి ప్రధానంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంష్’ చిత్రం ఐదు వారాలకు పైగా థియేటర్లలో కొనసాగుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ చిత్రం 37వ రోజున శనివారం ఒక్కరోజే భారత్‌లో సుమారు రూ.18.50 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో దేశీయంగా సినిమా మొత్తం కలెక్షన్లు రూ.192 కోట్లను దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ.236 కోట్ల మార్క్‌ను అధిగమించింది.
నేపథ్యంలోని ఆధ్యాత్మిక కథ, నీమ్ కరోలి బాబా జీవితానికి సంబంధించిన అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఐదు వారాలు దాటినా వసూళ్లలో కనిపిస్తున్న ఈ జోరు సినిమాకు బలమైన ఆదరణను చూపిస్తోంది. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!