

బిగ్ బాస్ తెలుగు 10’లో డే 7 ఎపిసోడ్ మరిన్ని ఆసక్తికరమైన ట్విస్టులతో సాగనుంది. ఇంట్లోకి వచ్చిన 16 మంది కంటెస్టెంట్లలో మొదటి రోజే 8 మందికి టాస్కుల ద్వారా మ్యాజికల్ కీస్ లభించగా.. ఆ తర్వాత వారి ద్వారా మరో ఇద్దరికి కీస్ దక్కాయి. దీంతో మొత్తం 10 మంది పవర్స్ పొందారు. అయితే చరణ్ మహాదేవ్, చైత్రా రాయ్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వర్షిణి, సుధీర్, రోహిత్, అమన్ మాత్రం ఎలాంటి పవర్స్ లేకుండా మిగిలారు. వీరిలో ఒకరికి ఆదివారం జరిగే టాస్క్ ద్వారా పవర్ దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే పవర్ ఉన్న పది మందిలో ఒకరి పవర్‌ను బ్లాక్ కీ ద్వారా తొలగించే ట్విస్ట్‌ను నాగార్జున వెల్లడించినట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం శ్రిష్టి తన పవర్‌ను కోల్పోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక ఆదివారం ఎపిసోడ్‌ను ‘సండే.. ఫండే’ తరహాలో వినోదాత్మకంగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమా డైలాగ్‌లను వినిపించి.. అవి ఏ సినిమాలోనివో గుర్తించే టాస్క్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ‘మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ రౌండ్లో ఝాన్సీ, వర్షిణి పోటీ పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘తింగర్లో టెన్షను’ పాటకు త్రిగుణ్ డ్యాన్స్ చేయగా.. నాగార్జున సరదాగా కౌంటర్లు ఇచ్చారు. దేబ్జానీ, రామ్ ప్రసాద్ మధ్య కూడా ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ‘ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే’ అనే డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తించే సమయంలో దేబ్జానీ కన్ఫ్యూజ్ కాగా.. ఆమె కోసం రామ్ ప్రసాద్ నెమ్మదిగా వెళ్లి చివరకు ఇద్దరూ కలిసి రౌండ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!