

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీక్షించి ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిత్రాన్ని చూసిన ఈ జంట.. అనంతరం చిత్రబృందాన్ని అభినందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ నేటి తరం యువత కలలు, బాధ్యతలు, భయాలను సహజంగా తెరపై ఆవిష్కరించారని విజయ్ కొనియాడారు.
ముఖ్యంగా సినిమాలోని తండ్రీకొడుకుల ఎమోషనల్ ఫోన్ కాల్ సన్నివేశం తనను కంటతడి పెట్టించిందని విజయ్ తెలిపారు. రష్మిక కూడా ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని ప్రశంసించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సహజమైన హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!