

పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సౌమ్యులు, మానవతావాదులుగా ఆర్యవైశ్యులు సమాజంలో విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం తెలిపారు. పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ఈ భవనం పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చూడాలని సంఘాల ప్రతినిధులకు సూచించారు. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, కొణిజేటి రోశయ్య వంటి ప్రముఖుల సేవలను ఆయన గుర్తుచేశారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయంగానూ తమ వాటాను సాధించుకోవచ్చని, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వారికి ప్రాధాన్యత కల్పించామని సీఎం పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!