

ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 సంవత్సరానికి అమలు చేస్తున్న కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి రూ.817 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్, కొత్త దరఖాస్తుల ఫీజుల రూపంలో ఈ ఆదాయం లభించింది. మొత్తం రూ.900 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేయగా, ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,652 మద్యం షాపుల్లో 2,929 షాపుల లైసెన్సులను రెన్యువల్ చేశారు. లైసెన్స్ ఫీజులో 38 శాతాన్ని రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌గా నిర్ణయించారు.
రెన్యువల్ అనంతరం మిగిలిన షాపులతో పాటు గతంలో కేటాయింపు కాని షాపులను కలిపి మొత్తం 807 షాపులకు లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిలో 517 షాపులకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో తక్కువ స్పందన కనిపించగా, మరికొన్ని చోట్ల ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మొత్తం 92 శాతం షాపుల రెన్యువల్, కేటాయింపు ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన షాపుల కేటాయింపుపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!