

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం నుంచి అధికారులతో మాట్లాడి వాతావరణ పరిస్థితులను తెలుసుకున్నారు. అల్పపీడనం నేడు సాయంత్రానికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తుఫాను కదలికలు, తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గతంలో ఆర్నబ్ తుఫాను ప్రభావం తరహాలోనే ప్రస్తుత తుఫాను కూడా ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేశారు. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలపై ప్రభావం ఉండవచ్చని తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!