
జనరల్

హైదరాబాద్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టి ఏనుగు దంతాల అక్రమ విక్రయ గుట్టును రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో నాలుగు ఏనుగు దంతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు సుమారు 17 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. అక్రమంగా ఏనుగు దంతాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ స్వాధీనం జరిగినట్లు సమాచారం.
దంతాలతో తయారు చేసిన పలు ఐవరీ వస్తువులు, ట్రోఫీలను కూడా డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాల అక్రమ రవాణా, విక్రయాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న దంతాలు, ఐవరీ వస్తువులకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!