
సినిమాలు

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు.
రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష పరిశోధన, వాణిజ్యం వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారం విస్తరిస్తోందని రూబియో చెప్పారు. ఈ భాగస్వామ్యం భారత్, అమెరికా భద్రత, బలం, అభివృద్ధికి దోహదపడటంతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!