

ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరేబియా సముద్రంలో ఓ అనుమానాస్పద ఇరానియన్ బోటును అడ్డుకున్నారు. అందులో సుమారు 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్ సహా అధిక నాణ్యత గల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ అక్రమ మార్కెట్‌లో వీటి విలువ ₹3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. బోటులో ఉన్న ఐదుగురు పాకిస్థానీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.
సెప్టెంబర్ 25న లక్షద్వీప్‌కు పశ్చిమాన ఈ ఆపరేషన్ చేపట్టారు. విశ్వసనీయ నిఘా సమాచారంతో సముద్ర, వైమానిక నిఘా నిర్వహించి బోటును గుర్తించిన కోస్ట్ గార్డ్.. అనంతరం దానిని అడ్డుకుని తనిఖీ చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, బోటు, అదుపులోకి తీసుకున్న వ్యక్తులను ముంబైకి తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతర లింకులపై కూడా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!