
క్రీడలు

నోయిడాలోని ఓ నివాస అపార్ట్‌మెంట్‌లో ఈవీ చార్జింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 50 కుటుంబాలను సురక్షితంగా బయటకు తరలించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!