

ఫిఫా ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పిటిషన్‌లో, అర్జెంటీనాకు రిఫరీల నుంచి అనుకూల నిర్ణయాలు వస్తున్నాయని ఆరోపిస్తూ, ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌కు లక్షలాది మంది మద్దతు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై ఫిఫా నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
ఇదిలా ఉండగా, సెమీఫైనల్‌లో అర్జెంటీనా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీకి చారిత్రక, రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. 1986 ప్రపంచకప్‌లో డిగో మారడోనా చేసిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ నుంచి ఫాక్‌ల్యాండ్ (మాల్వినాస్) దీవుల వివాదం వరకు ఈ ప్రత్యర్థిత్వం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూనే ఉంది. దీంతో ఈ సెమీఫైనల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!