
బిజినెస్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీ మంత్రి, కమర్హతి ఎమ్మెల్యే మదన్ మిత్ర పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గంలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
పార్టీని వీడిన అనంతరం మదన్ మిత్ర, అభిషేక్ బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నిర్ణయాలన్నీ అభిషేక్ చుట్టూనే తిరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ పునర్నిర్మాణం కోసం కొంతకాలం పక్కకు తప్పుకోవాలని సూచించినా ఆయన అంగీకరించలేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!