

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ రేపు (జూన్ 14) ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఆందోళన చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతున్నట్లు సీజేపీ పేర్కొంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలను వెంటనే సరిదిద్దాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
ప్రముఖ విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఆందోళనలో పాల్గొననున్నట్లు సీజేపీ వెల్లడించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ ఈ నిరసన నిర్వహిస్తున్నామని పార్టీ నాయకులు తెలిపారు. భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత ఈ కార్యక్రమానికి తరలిరానున్నట్లు అంచనా వేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!