

నంద్యాలలో కార్యకలాపాలు నిర్వహించిన ఓ మెడికల్ కోడింగ్ సంస్థ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. బాధితుల వాదన ప్రకారం, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఒక్కో అభ్యర్థి నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేశారు. ప్రారంభంలో మూడు నెలల పాటు ఉద్యోగాలు కల్పించి జీతాలు చెల్లించిన సంస్థ, అనంతరం జీతాల చెల్లింపులను నిలిపివేసి కార్యకలాపాలను నిలిపేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 700 మందికి పైగా యువత ఈ మోసానికి గురయ్యామని పేర్కొంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోగా, సంస్థ నిర్వాహకులు అందుబాటులో లేకుండా పోయారని బాధితులు వాపోతున్నారు. ఇటీవల కంపెనీ కార్యాలయానికి వెళ్లి చూడగా సంస్థ పూర్తిగా మూతపడినట్లు గుర్తించామని తెలిపారు. కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు అనుమానిస్తున్న బాధితులు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!