

ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి విద్యార్థి, ఉద్యోగి ఆశపడతారు. అయితే కేవలం లక్ష్యాన్ని గురించి ఆలోచించడం కాకుండా, దానిని చేరుకునే మార్గాలపై దృష్టి పెట్టడం అవసరం. ఈ నేపథ్యంలో ‘మైక్రో గ్రోత్ హ్యాకింగ్’ అనే భావన కెరీర్ అభివృద్ధికి ప్రభావవంతమైన మార్గంగా మారుతోంది. పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా విభజించి ప్రతిరోజూ మెరుగుపడటం దీని ప్రధాన ఉద్దేశం. జపాన్‌కు చెందిన ‘కైజెన్’ సిద్ధాంతాన్ని పోలి ఉండే ఈ విధానం నిరంతర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
ఉద్యోగ అవకాశాలను పెంచుకోవాలంటే ప్రతి జాబ్ రోల్‌కు అనుగుణంగా రెజ్యూమెను రూపొందించాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను సరైన కీవర్డ్స్‌తో ఆప్టిమైజ్ చేయడం, వ్యక్తిగత బ్రాండింగ్‌ను బలోపేతం చేయడం, పరిశ్రమ నిపుణులతో స్మార్ట్ నెట్వర్కింగ్ చేయడం అవసరం. అలాగే తాము నేర్చుకున్న నైపుణ్యాలను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించే పోర్ట్‌ఫోలియోను రూపొందించడం, పనితీరును మెరుగుపరిచే కొత్త పద్ధతులను అనుసరించడం ద్వారా కెరీర్లో వేగవంతమైన పురోగతి సాధించవచ్చు. చిన్న మార్పులు, నిరంతర కృషి చివరకు పెద్ద విజయాలకు దారితీస్తాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!