
హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు మంత్రులు ప్రత్యేకంగా ప్రయాణించనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రయాణం ప్రారంభమై, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రోలో, అనంతరం అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సచివాలయం వరకు మంత్రులు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలు, సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు 15 మంది మంత్రుల కోసం భట్టి విక్రమార్క కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. మొదటి దశ నుంచి చివరి దశ వరకు ప్రయాణ అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు, సాంకేతికత ద్వారా వివిధ ప్రజా రవాణా సేవలను అనుసంధానం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!