
జనరల్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని విచారించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రావాలని అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును లోతుగా పరిశీలిస్తున్న సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరించి, ఎంపీ చామల ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించినట్లు సమాచారం. బాధితుడిగా ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ దర్యాప్తులో కీలకంగా మారనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!