
బిజినెస్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్‌తో కలిసి ఆయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో స్వామివారి ఆశీస్సులు పొందారు.
అంతకుముందు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముకేశ్ అంబానీ కుటుంబానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అంబానీ కుటుంబానికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!