
బిజినెస్

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత వరుసగా భూకంపాలు సంభవించాయి. నాందేడ్, పర్భానీ, హింగోలి జిల్లాల్లో తెల్లవారుజామున 1:37 గంటల నుంచి 3:23 గంటల మధ్య నాలుగు సార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
అధికారుల వివరాల ప్రకారం, అత్యధికంగా రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!