
జనరల్

సింహం ఏదైనా జంతువుపై దాడి చేసే ముందు రెండడుగులు వెనక్కి వేసి, మెరుపు వేగంతో దూసుకెళ్తుంది. అలాగే కొన్ని పక్షులు కూడా ఆకాశంలోకి ఎగిరే ముందు గాలి దిశ, వేగాన్ని గమనిస్తూ తమ శరీరాన్ని అనువుగా సిద్ధం చేసుకుంటాయి. అలాంటి అద్భుతమైన దృశ్యమే నారాయణ పక్షి (గ్రే హెరాన్) విషయంలో కనిపించింది. నగర శివార్లలోని తుర్కయాంజాల్ పరిధిలో ఉన్న మాసాబ్ చెరువు వద్ద ఈ పక్షి అరుదైన భంగిమలో కనిపించింది. చెరువులోని సిమెంటు దిమ్మెపై నిల్చున్న పక్షి, వింటి నుంచి విడిచే బాణంలా తన శరీరాన్ని ముందుకు వంచి ఎగిరేందుకు సిద్ధమైంది.
ఆ తర్వాత రెండు కాళ్లను బలంగా వెనక్కి నెట్టి, విమానం టేకాఫ్ తీసుకున్నట్లుగా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. తొలిచూపులో ఈ పక్షి ఒంటి కాలితోనే ఎగురుతున్నట్లు అనిపించినా, నిశితంగా గమనిస్తే రెండు కాళ్లూ వెనక్కి చాపినట్లు కనిపిస్తాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!