

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన తదుపరి చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ తనది కాకపోయినా కథ నచ్చడంతోనే ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు తెలిపారు. ‘లక్కీ భాస్కర్’ షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఈ కథ విన్నానని, అప్పటి నుంచే దాని ప్రధాన ఇతివృత్తం తన మనసులో నిలిచిపోయిందని చెప్పారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రను సాత్విక వీరవల్లి పోషిస్తుండగా, శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రతి కూతురి కలలు, ఆశయాల చుట్టూ ఈ కథ సాగుతుందని, మహిళలు ఏ రంగంలోనైనా తమ లక్ష్యాలను చేరుకోగలరనే నమ్మకాన్ని ఈ చిత్రం అందిస్తుందని దుల్కర్ వివరించారు. ఈ కథ ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ స్క్రిప్ట్‌పై ప్రశంసలు కురిపించారు. గత ఐదేళ్లలో తాను విన్న అత్యుత్తమ కథల్లో ఇదొకటని, చివరి రీల్‌కు నేపథ్య సంగీతం అందిస్తున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!