
సినిమాలు

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మూసీ రిజర్వాయర్‌లోకి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితులను బట్టి రిజర్వాయర్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు మూసీ నది, పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేసే సూచనలు, భద్రతా హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని, అధికారుల సూచనలకు అనుగుణంగా సురక్షితంగా ఉండాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!