

అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అధికార రిపబ్లికన్ పార్టీకి స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ భారీగా విరాళాలు అందించినట్లు వెల్లడైంది. పార్టీకి ఆయన ఏకంగా 276 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,638 కోట్లు) సమకూర్చినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు మద్దతుగా నిలిచేందుకు జూలై నుంచి ఈ విరాళాలు అందజేస్తున్నట్లు తెలిపింది.
2025–26 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల కోసం మస్క్ రిపబ్లికన్ పార్టీకి మొత్తంగా 366 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,500 కోట్లు) అందించినట్లు ఆ కథనం వెల్లడించింది. అంతకుముందు, 2024లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన 290 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,772 కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు పేర్కొంది. తాజా విరాళాలతో అమెరికా రాజకీయాల్లో మస్క్ ఆర్థిక మద్దతు మరోసారి చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!