

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న కృత్రిమ మేధస్సు ఆధారిత నకిలీ వీడియోలను నమ్మి మోసపోవద్దని ఆమె కార్యాలయం ప్రజలను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రియాంక గాంధీ ముఖం, స్వరాన్ని ఉపయోగించి నకిలీ వీడియోలను రూపొందిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రియాంక గాంధీ పేరుతో వైరల్ అవుతున్న నకిలీ పెట్టుబడి వీడియోలను క్లిక్ చేయవద్దని సూచించింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక గాంధీ పేరుతో అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే వాటిని నివేదించడం లేదా నిరోధించడం చేయాలని ఆమె కార్యాలయం సూచించింది. పెట్టుబడుల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం ప్రియాంక గాంధీ కార్యాలయం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు ద్వారా హెచ్చరిక జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!