
రివ్యూలు

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. 22ఏ అంశంపై చర్చించాలని బీఆర్‌ఎస్ సభ్యులు డిమాండ్ చేయగా, వారు కోరిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం బీఆర్‌ఎస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పత్రాలను చించి గాల్లోకి ఎగరేశారు. 22ఏ అంశంపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. దీంతో శాసనమండలిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!