

పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తెలిపారు. నియోజకవర్గంలో సుమారు రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణానికి రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి 600కుపైగా సీసీ, బీటీ రోడ్ల పనులు పూర్తిచేశామని, మరో 202 రహదారులను ప్రారంభించామని తెలిపారు.
పిఠాపురంలో రూ.225 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఉప్పాడ తీరంలో రూ.323 కోట్లతో రక్షణ గోడ, తాగునీటి పథకాలు, ఆరోగ్య వసతులు, పార్కులు, చెరువుల అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి తదితర పనులు చేపడుతున్నట్లు పవన్ కల్యాణ్ వివరించారు. కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా కలిసి పనిచేయాలని అన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో పిఠాపురంలో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!