26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం

Writer: Chandrika 12:05 PM, 26 నవంబర్, 2026
దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం

దేశ రాజధాని దిల్లీలో మహిళలు, బాలికల భద్రతపై ఓ అధ్యయనం ఆందోళనకర విషయాలను వెల్లడించింది. సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌ (సీఈక్యూఐఎన్‌) నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. 87.5 శాతం మంది మహిళలు, బాలికలు సమీప మెట్రో స్టేషన్‌ లేదా బస్టాప్‌కు నడిచి వెళ్లడం సురక్షితం కాదని భావిస్తున్నారు. 88.9 శాతం మంది చీకటి పడిన తర్వాత సమీపంలోని పబ్లిక్‌ పార్కుల్లో అభద్రతకు గురవుతున్నట్లు తెలిపారు. మూడొంతులకు పైగా మహిళలు ఫుట్‌పాత్‌లపై తగినంత వీధి దీపాలు లేవని చెప్పగా.. 60 శాతం మంది ఫుట్‌పాత్‌లు ధ్వంసమయ్యాయని లేదా అందుబాటులో లేవని వెల్లడించారు. దాదాపు 80 శాతం మంది పురుషుల తదేకపు చూపులు, అసభ్య వ్యాఖ్యలు, వెంటపడటం వంటి వేధింపులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏ పౌర సంస్థను సంప్రదించాలో తమకు తెలియదని 80.5 శాతం మంది తెలిపారు.

మహిళల భద్రత అంటే కేవలం నేరాల నుంచి రక్షణ కల్పించడం మాత్రమే కాదని.. వారు నిత్యం ప్రయాణించే మార్గాలు, ఫుట్‌పాత్‌ల నిర్వహణ, వీధి దీపాలు, పార్కుల భద్రత, ప్రభుత్వ విభాగాల జవాబుదారీతనం కూడా కీలకమని నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిస్థితులు మహిళల ఉద్యోగావకాశాలపైనా ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వివరాలను ఉటంకిస్తూ.. 2024లో దిల్లీలో మహిళలపై 13,396 నేరాలు నమోదయ్యాయని, 19 ప్రధాన మెట్రో నగరాల్లో ఇదే అత్యధికమని తెలిపింది. అలాగే 2023–24లో దిల్లీలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 14.5 శాతంగా ఉండగా.. పురుషుల్లో అది 54 శాతంగా నమోదైందని పేర్కొంది. భద్రతాపరమైన ఆందోళనలు, స్వేచ్ఛగా ప్రయాణించలేకపోవడం మహిళల ఉపాధి అవకాశాలను పరిమితం చేసే అంశాలని అధ్యయనం అభిప్రాయపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

తిరుమలలో భక్తుల వసతి సముదాయాలపై అధికారుల నిఘా

తిరుమలలో భక్తుల వసతి సముదాయాలపై అధికారుల నిఘా

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

గ్లోబల్ సమ్మిట్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్స్

గ్లోబల్ సమ్మిట్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్స్

కార్తిగై దీపం వివాదంపై సీఎం విజయ్‌ను నివేదిక కోరిన గవర్నర్

కార్తిగై దీపం వివాదంపై సీఎం విజయ్‌ను నివేదిక కోరిన గవర్నర్

ట్యాగ్లు
దిల్లీమహిళల భద్రతమహిళల రక్షణసీఈక్యూఐఎన్‌ అధ్యయనంప్రజా రవాణాదిల్లీ మెట్రోవీధి దీపాలుఫుట్‌పాత్‌లుమహిళలపై వేధింపులుఎన్‌సీఆర్‌బీ గణాంకాలుమహిళల ఉపాధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రామాయణ చిత్ర బృందం
సినిమాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రామాయణ చిత్ర బృందం

బిగ్ బాస్ ఇంట్లోకి సన్నీ, సిరి..
షోస్

బిగ్ బాస్ ఇంట్లోకి సన్నీ, సిరి..

ఆర్థిక కష్టాల నుంచి ఆస్కార్ విజేతగా ఏఆర్ రెహమాన్ స్ఫూర్తిదాయక ప్రయాణం
సినిమాలు

ఆర్థిక కష్టాల నుంచి ఆస్కార్ విజేతగా ఏఆర్ రెహమాన్ స్ఫూర్తిదాయక ప్రయాణం

దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం
జనరల్

దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం

ట్రంప్‌ టారిఫ్‌లపై డెమోక్రాట్ల ఆగ్రహం..
రాజకీయాలు

ట్రంప్‌ టారిఫ్‌లపై డెమోక్రాట్ల ఆగ్రహం..

వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఫన్నీ రియాక్షన్
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఫన్నీ రియాక్షన్

మహిళా రిజర్వేషన్లపై విపక్షాల తీరును తప్పుబట్టిన మోదీ..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లపై విపక్షాల తీరును తప్పుబట్టిన మోదీ..

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?
జనరల్

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...
రాజకీయాలు

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..
జనరల్

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

ఫవాద్ ఖాన్ ఓటీటీ సిరీస్‌కు భారత్‌లో చిక్కులు
ఓటీటీ

ఫవాద్ ఖాన్ ఓటీటీ సిరీస్‌కు భారత్‌లో చిక్కులు

భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై స్పందించిన అనుపమ
సినిమాలు

భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై స్పందించిన అనుపమ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!