

హెల్త్‌కేర్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బీపీఓ) రంగాల్లో విశేష అనుభవం కలిగిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా అందించారు. ఆయన యాక్సెస్ హెల్త్‌కేర్ సంస్థ వ్యవస్థాపకుడు, వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో డెల్ సర్వీసెస్ బీపీఓ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. హెల్త్‌కేర్ సేవల రంగంలో విజన్ హెల్త్‌సోర్స్ సంస్థ స్థాపనలోనూ భాగస్వామిగా ఉన్నారు. అలాగే ఆసియా ఇంజనీరింగ్ సంస్థకు సహ యజమానిగా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ద్వారా పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేసే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) సాంకేతికత అభివృద్ధిలోనూ వర్ధమాన్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ కోడింగ్ రంగాల్లో ఆయనకు పేటెంట్లు ఉన్నాయి. లయోలా కళాశాలలో గణాంకశాస్త్రం అభ్యసించిన ఆయన, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. వ్యాపార రంగంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్‌కు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ, ఆవిష్కార్ సంస్థ ద్వారా పేద యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నారు. శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య సేవలకు తోడ్పాటునందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!