

నేపాల్ ప్రధాని బాలేంద్ర షా భారత్ పర్యటనకు చేరుకున్నారు. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఆయనకు స్వాగతం పలికారు. మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇంధనం, జలవిద్యుత్, రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. వారి సమక్షంలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. అలాగే, నేపాల్‌లో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
భారత్, నేపాల్ తమ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేపాల్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య, రవాణా భాగస్వామిగా ఉండటంతో పాటు భారీగా పెట్టుబడులు పెడుతోంది. నేపాల్ ఎగుమతుల్లో దాదాపు 80 శాతం భారత్‌కే చేరుతున్నాయి. అలాగే, నేపాల్‌కు వచ్చే మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు భారత్ నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ప్రధానుల మధ్య జరగనున్న సమావేశం ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారానికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!