

ప్రముఖ నటి త్రిషపై అభిమానంతో తమిళనాడులోని తిరునెల్వేలిలో ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ పేరుతో కొత్త సేవా సంస్థ ప్రారంభమైంది. తచ్చనల్లూరుకు చెందిన వ్యాపారవేత్త రాజగోపాల్ ఈ సంస్థను స్థాపించారు. తిరునెల్వేలి ప్రెస్ క్లబ్‌లో సంస్థ లోగోను ఆవిష్కరించడంతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘సామి’ సినిమాలో త్రిష పోషించిన ధైర్యవంతమైన నెల్లై యువతి పాత్ర తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆమెపై అభిమానంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు రాజగోపాల్ వెల్లడించారు. కేవలం అభిమాన సంఘంగా కాకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, ప్రత్యేక వెబ్‌సైట్‌లను రూపొందించడం వంటి ప్రణాళికలు ఉన్నాయని రాజగోపాల్ తెలిపారు. ఈ సంస్థకు రాజకీయ అనుబంధం లేదని, ప్రజా సేవ కోసమే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అయితే, భవిష్యత్తులో త్రిష ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై ఆమెనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఆమె రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగంతో కలిసి పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!