

గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడినప్పటికీ ఈ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్‌లోకి తీసుకెళ్లకుండా పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 90 సీట్లు వస్తాయని, తన వ్యూహం ప్రకారం ముందుకు సాగితే 100కు పైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల ఫలితాలే తమ బలాన్ని నిరూపిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఆ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు కల్పించే అంశాన్ని పార్టీ ఇన్‌చార్జితో చర్చిస్తానని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ముఖ్యమంత్రి కూడా ఓటు చోరీ జరుగుతోందని వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రస్తావించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!