

ముంబైలోని కుర్లా వెస్ట్‌లో ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్ వద్ద హిందూ దంపతులపై కొందరు బాలురు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులైన బాలురను అదుపులోకి తీసుకుని బహిరంగంగా తీసుకెళ్లారు. అక్కడ వారు ప్రజల సమక్షంలో క్షమాపణలు చెప్పినట్లు వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది. బాలుర చేతులకు తాళ్లు కట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోల్లో ఉన్నాయి.
ఈ దాడిలో కర్రలు, పిడిగుద్దులు, రాళ్లతో దంపతులపై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. వైరల్ అవుతున్న మరో వీడియోలో ఓ బాలుడు పెద్ద రాయిని దంపతుల వైపు విసురుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది మైనర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారిలో ఐదుగురి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశారు. బాధిత దంపతుల వివరాలు, వారికి అయిన గాయాలపై పోలీసులు ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!