

ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. టెహ్రాన్‌తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం అమెరికాకు లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం అంశం ముగిసిన కథ అని అభివర్ణించారు. తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ మేరకు పోస్టు చేశారు. ఇప్పటికే కీలకమైన హర్మూజ్ జలసంధిపై అమెరికా పట్టు సాధించిందని, ఇరాన్‌కు చెందిన వందల బిలియన్ల డాలర్లను స్వాధీనం చేసుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు, డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఆదేశించారు. మిన్నెసోటా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ తదితర రాష్ట్రాల్లో అవినీతి ఎక్కువగా ఉందని విమర్శించారు. డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ప్రతి నెలా బిలియన్ డాలర్ల మేర అవినీతి జరుగుతోందని, దానిని అరికడితే దేశ బడ్జెట్‌ను సమతుల్యం చేయడానికి అవకాశం ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!