

జులైలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్న తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ 14 ఏళ్ల బాలిక దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. బాలిక, ఆమె తల్లిదండ్రులను బెదిరిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బాలిక ఫిర్యాదుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన్‌ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులపై హింసకు పాల్పడిన వారు కేసుల నుంచి తప్పించుకునేందుకు బెదిరింపులకు పాల్పడితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం సూచించింది.
సీజేపీ నిరసన సందర్భంగా బాలిక తండ్రిపై దాడి చేసినట్లు వీడియో సందేశంలో వెల్లడించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన అనంతరం బాలికను వేధించడంతో పాటు ఆమె ఇంటిని ధ్వంసం చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు, అతడి అనుచరులపై చర్యలు తీసుకోకుండా బాధిత బాలికపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. బాలిక తండ్రిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను సీజేపీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!