
బిజినెస్

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్ ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5 గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఈ నెల 9న భారత్‌కు వచ్చిన ఆయన పర్యటన 15వ తేదీ వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ముర్ముతో భేటీ సందర్భంగా ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు.
ప్రధాని మోదీతో సమావేశంలో ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేసే అంశాలపై చర్చ జరిగింది. తన పర్యటనలో భాగంగా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ అహ్మదాబాద్, ముంబయి, హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!