
సినిమాలు

మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదని, కష్టపడటం ద్వారానే విజయాన్ని సాధించవచ్చని ఆమె తెలిపారు. ఇంటర్వ్యూల్లో అబద్ధాలు చెప్పకూడదని, తెలియనిది తెలియదని నిజాయితీగా చెప్పాలని యువతకు సూచించారు. తమపై విశ్వాసం ఉంచుకుంటే ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఆమె అన్నారు.
దాదాపు 150 కంపెనీలు పాల్గొని 2 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు కవిత తెలిపారు. అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలను కోరారు. ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, టెన్ పాస్ చేసిన అభ్యర్థులు కూడా పాల్గొన్నారని చెప్పారు. మొదటి ఉద్యోగం ఎంతో ముఖ్యమని, విఫలమయ్యినా మళ్లీ ప్రయత్నించాలని ఆమె యువతను ప్రోత్సహించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!