

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట.. నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళలో వైభవంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొత్త దంపతులు చేతిలో చేయి వేసుకుని వేదికపైకి వచ్చిన ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకలో కావ్య మారన్ ఎరుపు రంగు ఫ్లోరల్ లేస్ డిజైన్‌తో కూడిన టూ-పీస్ దుస్తుల్లో మెరిశారు. సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తూ తన లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. మరోవైపు అనిరుధ్ రవిచందర్ ముదురు బర్గండీ రంగు ఎంబ్రాయిడరీ బంద్‌గలా జాకెట్, నలుపు రంగు ట్రౌజర్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించారు. కొత్త జంట సంప్రదాయానికి భిన్నంగా ఎంచుకున్న ఈ రిసెప్షన్ లుక్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!